calender_icon.png 25 January, 2026 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

25-01-2026 11:40:42 AM

నంగునూరు,(విజయక్రాంతి): ​​సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందారు. గ్రామానికి చెందిన జామచెట్టు శ్రీనివాస్ రెడ్డి తన వ్యవసాయ బావి వద్ద మోటర్ మరమ్మతు కోసం ట్రాన్స్ఫార్మర్ బంద్ చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. దాంతో  రైతు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రాజగోపాల్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ట్రాన్స్ఫార్మర్ పై ప్రధానమైన విద్యుత్తిగా తెగి ఉండటం వల్ల స్తంభానికి విద్యుత్ సరఫరా అయిందనేది రైతులు తెలిపిన సమాచారం.