15 April, 2026 | 1:48 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

05-02-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 4:  విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం  చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం కాసరబాద గ్రామానికి చెందిన పంతం నాగరాజు తండ్రి మల్లయ్య(34)అను అవివాహితుడు జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన తన బావ అయిన బొర్ర నాగరాజు వద్ద గత రెండు సంవత్సరాలుగా ఉంటూ గ్రామానికి చెందిన పలువురి రైతుల వద్ద పొలంను కౌలుకు తీసుకుని జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో పిట్టల లక్ష్మమ్మ వ్యవసాయ మోటర్ వద్ద పశువులు వైర్లు తెంపడంతో వాటిని సరిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుని తల్లి పంతం నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఎస్త్స్ర సైదులు తెలిపారు.కాగా అందరితో కలివిడిగా ఉండే పంతం నాగరాజు మృతితో అడివెంల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.