04-07-2025 01:10:43 AM
ఫైనాన్స్ క్లియర్ కోసం ఫైనాన్స్ మంత్రి వద్దకు ఫైల్!!
కామారెడ్డి, జూలై 3 (విజయ క్రాంతి), ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 22వ ప్యాకేజీ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న సదుద్దేశంతో రూ.1540 కోట్లతో చీఫ్ ఇంజనీర్ ఈ ఎన్ సితో సంతకం చేయించడం జరిగిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో రూ.2కోట్ల40 లక్షల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పై విధంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తుంటారని వ్యవసాయ పంటలు పండించడానికి కర్షకులకు సాగునీరు అవసరమన్న సదుద్దేశంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు చెప్పులు అరి గేలా తిరిగి 23 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందన్నారు.
అలాగే 22వ ప్యాకేజీలో లక్ష ఎకరాలకు కర్షకులకు సాగునీరు అందించాలన్న తపన కర్షకుల కన్నీరు తీర్చాలన్న ఆకాంక్షతో 1450కోట్లతో చీప్ ఇంజనీర్ ఈ ఎన్ సితో సంతకం చేయించి ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బరుజీతు తో సంతకం చేయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వద్దకు ఫైల్ పంపించడం జరిగిందని ఫైల్ క్లియరెన్స్ కాగానే లక్ష ఎకరాలకు నీరు అందించడానికి కావలసిన పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సభలో ప్రకటించారు.
దీంతో రైతులు అర్షద్వనాలు లతో చప్పట్లు కొట్టారు. ఎమ్మెల్యే జిందాబాద్ అనేదాలతో ఉర్రూతలూగారు. మోతే కాళోజి వాడి దగ్గర రిజర్వాయర్ నిర్మించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోని రైతుల్లో ఆనందం వెలివేరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఆర్గుల్ నుండి ఇందల్వాయి ఇందల్వాయి నుండి మల్లన్న గుట్ట వరకు మల్లన్న గుట్ట నుండి లింగంపల్లి వరకు పైప్ లైన్ ద్వారా నీళ్లు వస్తాయని ఆయన తెలియజేశారు.
కాలేశ్వరం 22 ప్యాకేజ్ కోసం వేయవలసిన పైపులు వర్షానికి నాని ఎండకు ఎండి తుప్పు పట్టి పోవడం జరిగిందని ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. తుప్పు పట్టిన పైపులను మార్చి ఈ ప్రాంత పేద రైతులకు పంటలు సాగు చేసుకోవడానికి నీరు అందించాలని అసెంబ్లీలో ప్రస్తావించడం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం నా కర్తవ్యం గా భావించి ప్రభుత్వ దృష్టికితీసుకు వెళ్లడం వలన స్పందించిన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు.
గత పాలకులు వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన దాఖలాలు లేకపోవడం వల్లనే ఈ ప్రాంతం మరింత వెనుకబడి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా నీటి సౌకర్యం పుష్కలంగా ఉండాలని అప్పుడే పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గాంధారి,సదాశినగర్, తాడ్వాయి, రామారెడ్డి, గ్రామాల యువతకు పరిశ్రమలు వస్తే ఉపాధి లభించి వారి జీవితాలు వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి అన్న సదుద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నత అధికారుల వద్దకు చెప్పులు అరిగేలా తిరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ఈ విషయం ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. ప్రజలు ఇచ్చిన ఈ అధికారంతో ప్రజలకు అంకుటిత సేవ దృక్పథంతో నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు.
నన్ను గెలిపించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నాపై విశ్వాసం ఎంతవరకు పెట్టుకోవడం జరిగిందో అంతకు రెట్టింపు పనులు చేసి చూపించడం జరుగుతుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలియజేశారు. ప్రజల ఆశీర్వాదం తనపై ఎప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి మిషిన్ భగీరథ అధికారులు సదాశి వ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు, మహిళలు,కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు శ్రేయోభిలాషులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు