calender_icon.png 4 July, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్‌లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

04-07-2025 01:13:07 AM

నిజాంసాగర్ జూలై 03(విజయక్రాంతి ); జుక్కల్ లో కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పేర్కొన్నారు.గురువారం నాడు హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు & భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రువర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో భేటీ అయ్యారు.

జుక్కల్ నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి గురించి మంత్రి కి వివరించి గ్రామాలకు కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే  కోరగా మంత్రి తక్షణమే స్పందించి 32.20 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే గాక, పనుల ప్రారంభోత్సవానికి మంత్రి వర్యులు ఈ నెల 7 వ తేదీన_  _నియోజకవర్గానికి వస్తున్నారని ఎమ్మెల్యే  తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  కృతజ్ఞతలు తెలియజేశారు.