పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలి
బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాని మోడీని కోరాం
జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): బీసీ బిల్లుకై ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కినప్పుడే మహిళ బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. ప్రతిపక్షా లు బీసీ బిల్లుపై మాట్లాడకుండా బీసీ మహిళ సబ్ కోటాపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల బీసీ బిల్లు పెట్టాలని ప్రధాని మోదీని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని కృష్ణయ్య తెలిపారు. బీజేపీపై బీసీ వ్యతిరేక పార్టీ ముద్ర వేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ ఓబీసీ ప్రధాని తోపాటు ఉప రాష్ట్రపతి 27 మంది కేంద్ర మంత్రులను బీసీలకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీసీ బిల్లు కోసం అం దరూ కలిసి రావాలని, అప్పుడే బీసీ మహిళలకు న్యా యం దక్కుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో మహిళ బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ కృష్ణయ్య తెలిపారు. కార్యక్రమంలో బీసీ నేతలు రాజేందర్, నీల వెంకటేష్ ముదిరాజ్, జీ. అనంత య్య, మోదీ రాందేవ్, నిఖిల్ పటేల్, లిం గన్న, పృథ్వి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






