16 April, 2026 | 3:33 AM

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి

16-04-2026 02:01 AM

సూర్యాపేట, ఏప్రిల్ 15(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మృతి చెం దిన ఘటన ఖమ్మం ద్ జాతీయ రహదారి ‘365 బిబి’పై పిల్లలమర్రి శివారులో బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంకు చెందిన పీసీసీ సభ్యులు, మాజీ నగర పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో పిల్లలమర్రి శివారులో ఆయన ప్ర యాణిస్తున్న వాహనం అతివేగంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో జావీద్‌కు  తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు వెం టనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.