16 April, 2026 | 3:26 AM

మెరిసిన ‘అల్ఫోర్స్’ విద్యార్థులు

16-04-2026 02:03 AM

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు  

కరీంనగర్, ఏప్రిల్15(విజయక్రాంతి): విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలతో బో ధించినట్లయితే సంచలనాత్మక ఫలితాలను సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో సీబీఎస్‌ఈ ఫలితాల్లో సంచలనాత్మక ఫలితాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల స మావేశానికి, విద్యార్థుల సన్మాన సభకు ఆ యన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

బుధవారం ప్రకటించినటువంటి సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ హై స్కూల్ కి చెందినటువంటి విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 103 మంది విద్యార్థులు 500 మా ర్కూలకు గాను 450 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నూతన చరిత్రను సృష్టించారని అన్నారు. సానీక-494, ఆదిత్య-492, ఎం. శ్రీహిత, ఏ.హర్ష, ఏ.శ్రీనిత 490 మార్కులు, కే.ఓం కార్తికేయ, కె.అస్మిత, కే.అభిజ్ఞ 488 మార్కులు,

ఏ.స్వరవిస్తృతి 487 మార్కులు, ఎం.శ్రీగౌరీ 486 మార్కులు, కె.వర్దిని 485 మార్కులు,ఉదయశ్రీ, వి. అభిరామ్ - 484, కే.మోక్స్, జి. సాయి సుశేన్, ఈ ప్రమేష్ రెడ్డి -483 మార్కులు సాధించారని, విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో నూరు శాతం మార్కులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు, అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.