20-11-2024 12:00:00 AM
దుబాయ్: దక్షిణాఫ్రికా పేసర్ గెరా ల్డ్ కోయెట్జేను ఐసీ సీ మందలించింది. ఇటీవలే భారత్‌తో నాలుగో టీ20 సం దర్భంగా అంపైర్ నిర్ణయం పట్ల దురుసుగా ప్రవర్తించడంపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు పలేకర్, స్టీఫెన్ హారిస్, థర్డ్ అంపైర్ లుబాబ్లో గుమా ఐసీసీ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ‘నాలుగో టీ20 సందర్భంగా అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించి కోయెట్జే ఐసీసీ కోడ్‌ను ఉల్లఘించాడు.
ఆర్టికల్ 2.8 ప్రకారం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అంపైర్‌ను దూషించడం నేరం. దీంతో కోయేట్జేకు మందలింపుతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించాం’ అని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తెలిపారు. ఒక ఆటగాడు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు దాటితే రెండేళ్ల నిషేధం పడే అవకాశముంది.