calender_icon.png 14 November, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంకదే వన్డే సిరీస్

20-11-2024 12:00:00 AM

పల్లెకెలె: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 2-0తో సొంతం చేసుకుంది. మంగళవారం జరగాల్సిన మూడో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వర్షం పడే సమయానికి 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగు లు చేసింది. విల్ యంగ్ (56 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. 

వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కుశాల్ మెండిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకున్నాడు. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం మంగళవారం లంక క్రికెట్ బోర్డు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్పిన్నర్ లసిత్ ఎంబుల్డేనియా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.