20-11-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మందితో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొన్ని రోజులుగా వరుసగా విఫలమవుతూ వస్తోన్న ఓపెనర్ షఫాలీ వర్మను పక్కనబెట్టింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఈ భారత ఓపెనర్ ఈ ఏడాది ఆరు మ్యాచ్‌ల్లో 108 పరుగులు మాత్రమే చేసింది.
షఫాలీతో పాటు ఉమా చెత్రి, హేమలత, శ్రేయాంక, సయాలీ సత్‌గరేలకు జట్టులో చోటు దక్కలేదు. కివీస్‌తో సిరీస్‌కు దూరమైన హర్లీన్ డియోల్, రిచా ఘోష్, మిన్నూ మాని, టిటాస్ సాధు, ప్రియా పూనియా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. డిసెంబర్ 5న తొలి వన్డే, 8న రెండో వన్డే, 11న మూడో వన్డే జరగనుంది.