06-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 5(విజయ క్రాంతి): చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్ద కాపర్తి గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం కు సొంత భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె భవనంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్వహించడం వలన బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఉన్న భవనంలో సిబ్బంది ఆరోగ్య సేవలు అందించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే సొంత భవనానికి నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ను ఆయన కోరారు.