calender_icon.png 9 January, 2026 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్రూం బోగస్ పట్టా.. ఎఫ్‌ఐఆర్ నమోదు

06-01-2026 12:00:00 AM

సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరామ్

సికింద్రాబాద్, జనవరి ౫ (విజయక్రాంతి): డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ముగ్గురు వ్యక్తు లు బోగస్ పట్టా సర్టిఫికెట్లు సమర్పించిన విషయం పరిశీలించడం జరిగిందని ఆర్డీవో సాయి రామ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే రామచంద్రపురంలో కేటాయించి న ఫ్లాట్ చిరునామాలతో కూడిన పట్టాలతో బి.లక్ష్మి, బి.దీప అలాగే బి. సుజాత అనే వారి పేరు మీద బోగస్ నకిలీ 2 బిహెచ్‌కే పట్టాలు గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించటం జరిగిందని  పేర్కొ న్నారు.

రెవెన్యూ డివిజనల్ ఆఫీ సర్, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్, హైదరాబాద్ జిల్లా అనే నకిలీ స్టాంప్ ఉండ టం గమనించడమైందని ఆర్డీవో సాయిరాం తెలిపారు. నకిలీ/బోగస్ పట్టా సర్టిఫికేట్ సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వెల్లడించారు.