13-10-2025 07:47:05 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఎఐఎఫ్బి) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజున కేబుల్ బ్రిడ్జిపైన రోడ్డును వేయాలని, లైటింగ్ ను ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ పేరుతో జరిగిన అభివృద్ధిపై అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాస్తారోకో, ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఏఐఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న కేబుల్ బ్రిడ్జికి అభివృద్ధికి చేసింది గుండు సున్న అని, పేరుకే మంత్రులు జిల్లాకు చేసింది ఏమీలేదని, కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదని విమర్శించారు.
కేబుల్ బ్రిడ్జిపైన, చౌరస్తాలో రోడ్లు గుంతలు ఉండటంతో ఇప్పటికి పదిహేను ఆక్సిడెంట్ లు జరిగాయి, ముగ్గురు చనిపోయారని కాని అధికారులకు ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదని విమర్శ చేశారు. కేబుల్ బ్రిడ్జి చౌరస్తాలో హైమస్ లైట్ లు ఏర్పాటు చేయాలని, చౌరస్తాను సుందరికరణ చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ రాష్ట్ర నాయకులు ఆవుల ఆదిత్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ సభ్యులు కె.బద్రి, పార్టీ నాయకులు సాయి అనురాగ్, ఆనంద్, శ్రవణ్, పవన్, రఘు, సాయి కిరణ్ రెడ్డి, సాయి కిరణ్ రావు, పవన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.