21-08-2025 01:24:55 AM
ములుగు, ఆగస్టు20 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తూ ఉండడంతో జిల్లాలోని రామన్న గూడెం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం ఉదయం 11గంటలకు గోదావరి వరద ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలో 15.83 మీటర్స్ చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగిందని, ఏలాంటి ముప్పు ఏర్పడిన తక్షణమే అధికారులకు సమా చారం ఇవ్వాలని ఆయన తెలిపారు. వెంకటా పురం మండలంలో ఐదు కుటుంబాల వారిని,
వాజేడు మండలంలో 15కుటుం బాల వారిని,కన్నాయిగూడెం మండలంలో 33కుటుంబాల వారిని,గోవిందరావుపేట మండలంలోని రెండు కుటుంబాల వారిని ఏటూరునాగారం మండలంలో 50మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరి గిందని వివరించారు.
జిల్లాలో 8పునరా వాస కేంద్రాలలో 75 కుటుంబాలకు చెందిన 216 మందిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.గోదావరి పరిసర ప్రాంతాలలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7109కు కాల్ చేయవచ్చని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.