calender_icon.png 21 August, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంతేవాడలో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

21-08-2025 01:21:44 AM

-వీరి పేరిట రూ.25.50 లక్షల రివార్డు

- నారాయణ్‌పూర్‌లోనూ లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు

చర్ల, ఆగస్టు 20 (విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ర్టమైన ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని దంతేవాడలో బుధవారం 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 13 మందిపై రూ.25.50 లక్షల రివార్డు ఉంది. నారాయణ్‌పూర్‌లో సైతం ఇద్దరు మహిళలు సహా 8 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.

వీరిలో డీవీసీఎం డాక్టర్ సుక్లాల్ ఉన్నారు. వీరి పేరిట రూ.30 లక్షల రివార్డు ఉందని నారాయణ్‌పూర్ ఎస్పీ రాబిన్‌సన్ గుడియా మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ అబుజ్‌మడ్‌లోని కుతుల్ ప్రాంతంలో పునరావాసం కల్పిస్తున్నట్టు ఎస్సీ చెప్పారు. వారికి అన్ని విధాలా సహకరిస్తామని. భద్రత, గృహనిర్మాణం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలు ఉంటాయని అన్నారు.