calender_icon.png 21 August, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

21-08-2025 01:26:06 AM

-జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పిటిషన్

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యహరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం విచారణ జరగనున్నది.

ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ గత ఏడాది మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 6ను కూడా పిటిషన్‌లో సవాల్ చేశారు. ప్రతివాదులుగా జస్టిస్ ఘోష్ కమిషన్, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కమిషన్‌ను నియ మించారని, కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా నివేదికను రూపొందించిందని పిటిషన్‌లో తెలిపారు.