24 August, 2026 | 1:13 AM

గాండ్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

24-08-2026 12:11 AM
  1. రూ.10వేల కోట్ల నిధులు కేటాయించాలి
  2. అఖిల గాండ్ల తెలికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్

ముషీరాబాద్,ఆగస్టు 23(విజయక్రాంతి): ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ గాండ్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్ల నిధులు కేటాయించాలని అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు అసోల్ల రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అమనగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోసరి సురేష్ కుమార్, బొల్లం సత్తయ్య లు డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల గా ండ్ల తెలికుల సంఘం సర్వసభ్య సమావేశం సంఘం ప్రతినిధి ముత్తుమల్ల రామచంద్రం అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ఎన్నుకోబడిన నూతన అధ్యక్ష కా ర్యదర్శులకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు గాండ్ల కులస్తులు ఉన్నారని, వా రిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తమ కులవృత్తిని కొనసాగించేందుకు యువతకు ప్రభుత్వం సబ్సిడీ యంత్రాలను ఇవ్వాలని కోరారు. గానుగ నూనెను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గాండ్ల కులస్తుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు నూతన వెబ్ సైట్ ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధికి చేస్తామని పేర్కొన్నారు. గాండ్ల కులస్తులను చిన్న చూ పు చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా గాం డ్ల సంఘం నూతన కమిటీలను ఏర్పాటు చే సి తమ కులస్తులను చైతన్యం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 22 జిల్లాలకు నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు రామచంద్రయ్య, డాక్టర్ బొల్లం సాహితి, లక్ష్మణ్,  అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.