calender_icon.png 25 October, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనివాస్ పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం

25-10-2025 01:17:15 AM

రేపు కరీంనగర్‌లో నిర్వహణ

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో ఈ నెల 26  (ఆదివారం)న “శ్రీనివాసు” పేరు గల వ్యక్తు ల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఊట్కూరి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ మల్కాపూర్ రోడ్డు పివిఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారని తెలంగాణ హోటల్ అసోసియే షన్ రాష్ర్ట జాయింట్ సెక్రెటరీ, డైమండ్ నేత్ర నిధి వ్యవస్థాపకులు లయన్ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్), మెట్రో ఉమ్మడి నల్లగొండ బ్యూరో, సీనియర్ జర్నలిస్ట్ రంగా శ్రీనివాస్ తెలిపారు.

రాష్ర్టంలోని నివసించే శ్రీనివాస్ అనే ఒకే పేరు గల వ్యక్తుల మహాకలయికను భారీ స్థాయి లో ప్రపంచ రికార్డును సృష్టించాలనే సంకల్పంతో తమవంతుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి గ్రూప్ హలో శ్రీనివాస్ అనేది విశిష్టమైన ఐక్యతకు ప్రతీక అని వేలాది మంది శ్రీనివాస్‌లతో జరగనున్న సమావేశం ద్వారా మన సామాజిక, సంస్కృతిక ఐక్యతకు గ్లోబల్ గుర్తింపు దక్కించుకుంటామని వారు పేర్కొన్నారు. హలో శ్రీనివాస్ చలో కరీంనగర్ పేరిట భారీ మహాసభ జరగనుందని, శ్రీనివాస నామ మహిమను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం వేలాది మందితో జరగనుందన్నారు.