25-10-2025 11:53:20 AM
ఆదిలాబాద్, (విజయక్రాంతి): హైదరాబాదులో ఈనెల 19న జరిగిన 10వ తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో(Telangana Masters State Level Swimming Championship Competition) ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం స్విమ్మింగ్ కోచ్ లు చంద్రకాంత్, వంశీ కృష్ణ లు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించారు. 50 మీటర్ ఫ్రీ స్టైల్ బంగారు పతకం, 100 మీటర్ బ్యాక్ స్ట్రోక్ కాంస్య పతకం, 50 మీటర్ బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్ లలో కాంస్య పతకం, 200 మీటర్ ఫ్రీ స్టైల్ రజత పతకం, 50 మీటర్ ఫ్రీ స్టైల్ రజత పతకం, 50 మీటర్ బ్రెస్ట్ స్ట్రోక్ కాంస్య పతకం సాధించారు.
కాగా నవంబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వీరు ఎంపిక అవ్వడం పట్ల శనివారం చంద్రకాంత్, వంశీ కృష్ణ ను జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ కోరెడ్డి పార్థసారథి, డి.వై.ఎస్.ఓ జక్కుల శ్రీనివాస్, స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాబడే రాష్ట్రపాల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్, శ్రీనివాస్ గౌడ్, రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.