calender_icon.png 25 October, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 19న బంజారాల స్వర్ణోత్సవం

25-10-2025 01:19:21 AM

పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

నల్లగొండ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఢిల్లీలో నవంబర్ 19న జరిగే గిరిజన బంజారాల రిజర్వేషన్ -50 సంవత్సరాల స్వర్ణోత్స వాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు.  శుక్రవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో స్వర్ణోత్సవ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.

ఈ సందర్భం గా ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయ క్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే ఈ స్వర్ణోత్సవంలో  గిరిజను లంతా పాల్గొనాలని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. స్వర్ణోత్సవంలో స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్ప మాల్యార్పణ, సోనియాగాంధీకి పాలాభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. చందంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బధ్యానాయక్ పాల్గొన్నారు.