calender_icon.png 25 October, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల జిల్లా కో ఆపరేటివ్ అధికారి

25-10-2025 12:35:55 PM

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కోఆపరేటివ్ అధికారి రాథోడ్ బిక్కు ఏసీబీకి(Anti-Corruption Department) చిక్కాడు. రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ రాథోడ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. సహకార సంఘం కార్యదర్శిని కో ఆపరేటివ్ అధికారి లంచం అడిగాడు. సస్పెండ్ అయిన కార్యదర్శని విధుల్లోకి తీసుకునేందుకు లంచం డిమాండ్ చేశాడు. రూ. 7 లక్షలు డిమాండ్ చేసి రూ. 5 లక్షలకు అధికారి ఒప్పందం చేసుకున్నాడు. 

సహకార బ్యాంకు ఉద్యోగి(Cooperative bank employee) నుండి ముందస్తుగా రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా  డీసీఓ రాథోడ్ బిక్కును(Mancherial District Cooperation Officer) పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఏసీబీ అధికారుల ప్రకారం, డీసీఓ ఉద్యోగిని రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేస్తూ వేధించాడు. పదే పదే అడిగిన తర్వాత అతను రూ.5 లక్షలు తీసుకోవడానికి అంగీకరించాడు. అయితే, ఉద్యోగి ఏసీబీని ఆశ్రయించగా, వారు ఉచ్చు బిగించి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. బిక్కును కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.