25-10-2025 12:24:12 PM
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.
ఇంటర్ సిలబస్‌లోనూ మార్పులు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్.
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల(Telangana Inter exam dates finalized ) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ సిలబస్ లోనూ ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇంటర్నల్స్ కు 20 మార్కులు, ఎక్స్ టర్నల్ పరీక్షలకు 80 మార్కులు. 12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్ లో ఇంటర్ బోర్టు మార్పులు చేసింది. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్‌లోనూ మార్పులు చేసింది. హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్, అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ లతో ఏసీఈ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మీడయా సమావేశంలో పేర్కొన్నారు.