23-06-2025 12:00:00 AM
సూర్యాపేట, జూన్ 22 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1969 హెచ్ ఎస్ సి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 56ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా పాఠశాల ఆవరణలో కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెరవేసుకున్నారు.
తదుపరి తమకు చదువు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానించారు. అలాగే వారికి మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి సత్యనారాయణ ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, పూర్వ విద్యార్థులు డాక్టర్ రామరాజు శ్రీనివాస రావు, మాలతి రెడ్డి ,అంజనాదేవి,లీల, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.