calender_icon.png 8 July, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రామిక వర్గం ప్రయోజనాలను కాలరాస్తున్న నరేంద్ర మోడీని గద్దె దించాలి..

07-07-2025 07:06:08 PM

భద్రాద్రిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు..

ఎంబి బాల నర్సారెడ్డి..

భద్రాచలం (విజయక్రాంతి): శ్రామిక వర్గ ప్రజల ప్రయోజనాలను కాలరాస్తున్న నరేంద్ర మోడీని గద్దె దించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి(CPM District Secretary Group Member MB Narsa Reddy) అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలో  ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన సిపిఎం కార్యాలయం నందు  జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్), బి ఆర్ ఎస్ పార్టీలతో పాటు సిఐటియు, ఐఎన్టీయూసీ, ఏఐటియుసి, ఐద్వా, మొదలగు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తూ శ్రామిక వర్గ ప్రయోజనాలను కాలరాస్తున్నారని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకురావడం జరుగుతుందని, అందులో భాగంగానే ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 10 నుండి 12 గంటలు పని విధానాన్ని తీసుకురావడం దుర్మార్గమైనటువంటి చర్యని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో పేదరికం పెరిగిందని, ధరలు ఆకాశాన్ని అంటాయని, నిరుద్యోగం, అసమానతలు పెరిగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సిపిఐ పట్టణ కార్యదర్శి మా రెడ్డి శివాజీ, బిఆర్ఎస్ పట్టణ నాయకులు తుమ్మలపల్లి ధనేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కెచ్చల కల్పన, సిఐటియు పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు, ఐ ఎన్ టి యు సి పట్టణ నాయకులు మాధవరావు.. ఏఐటీయూసీ పట్టణ కన్వీనర్ కంభంమెట్టు శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా అధ్యక్షులు డి సీతాలక్ష్మి, లు మాట్లాడుతూ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కోటగిరి ప్రభుత్వ కుమార్ జై ప్రేమ్ కుమార్ కె సీతామహాలక్ష్మి, సి.పి.ఐ నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు, శోభన్ బాబు, చంటి, ఉమాదేవి, ఐద్వా నాయకులు నాదెళ్ల లీలావతి,పూర్ణ, గౌతమి,సుబ్బలక్ష్మి సిఐటియు నాయకులు వై వెంకట రామారావు, నాగరాజు, అజయ్ కుమార్, భూపేంద్ర,పెయింటర్ వర్కర్ సీనియర్ నాయకులు జాకీ, రాడ్ బెండింగ్ నాయకులు రాజబాబు, బిల్డింగ్ వర్కర్ సీనియర్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.