07-07-2025 07:03:24 PM
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద..
హుజురాబాద్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడం ద్వారా విద్యాభ్యాసంలో ఉత్తేజాన్ని పెంచి, వారికి అవసరమైన వనరులు అందించడంతో ఎంతో సహాయపడుతుందని శాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థుల సంక్షేమం కోసం సోమవారం అనిల్(హోంగార్డ్) తన తల్లి స్మారకార్థం విద్యార్థులకు ఆహార ప్లేట్లు, నీటి సీసాలను అందజేసి ఉదారతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవాభావం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు మానవత్వంతో ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్లేట్లు, నీటి సీసాలు అందజేసిన అనిల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అశోక్ కుమార్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల రమేష్, తిరుపతయ్య, సమ్మయ్య, రాజేశం, సాకేత్, ఆదిత్య లతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.