07-07-2025 06:32:40 PM
దామరచర్ల (విజయక్రాంతి): సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని కాంగ్రెస్ యువనేత సిద్దు నాయక్(Congress youth leader Sidhu Naik) అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గొనియా తండా గ్రామపంచాయతీ ఆవాస గ్రామం దూదియాతండాకు చెందిన ధనావత్ విజయ నివాసానికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ 26 వేల రూపాయల చెక్కుని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ యువనేత సిద్దు నాయక్ బాధితురాలు విజయకు చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని సిద్దు అన్నారు.
సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు సిద్దు చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధనావత్ రాంపత్త నాయక్, ధనావత్ తార్ సింగ్ నాయక్, బాలు నాయక్, నాగ నాయక్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.