07-07-2025 06:26:19 PM
నోటు పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
మునిశ్వరానంద స్వామీజీ...
తరిగొప్పుల (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) తరిగొప్పుల మండల కేంద్రంలో భారత సేవాశ్రమ సంఘం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల సుమారు 1100 వందల మంది విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(పి.ఎం శ్రీ)లో నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ రామారావు, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారత సేవాశ్రమ సంఘం తరపున మునీశ్వరానంద స్వామి ఇంతటి మహత్తర కార్యక్రమం చేయడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తరిగొప్పుల మండలం తీసుకురావడం వలన మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుంది అన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదివి పై స్థాయిలకు ఎదిగి ఉన్నత లక్ష్యాలను ఛేదించాలని ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందరో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ కు అభినందనలు తెలిపారు.
భారత సేవాశ్రమ సంఘం చైర్మన్ మునిశ్వరానంద స్వామీజీ మాట్లాడుతూ... ఈ కార్యక్రమం తరిగొప్పుల మండలంలో చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ పుస్తకాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జనగామ జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉంటూ విద్యకు దగ్గరగా ఉండాలని విద్యార్థి దశ అనేది భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది అని ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలను ప్రభావితం చేస్తాయని ఈ విలువైన సమయాన్ని చదువు కొరకు ఇప్పుడు ఉపయోగిస్తే ముందు తరం ఎంతో మంచి స్థాయిలో ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జానకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ నాయక్ ఏ ఎస్ ఐ రాజయ్య అప్స స్వచ్ఛంద సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్ గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి టీజేయు ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదాద్రి భువనగిరి అధ్యక్షుడు షానూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రమేష్ యాదవ్ కార్యదర్శులు చిలువేరు మహేందర్ సొంటెక్క కుమార్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తరిగొప్పుల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.