07-07-2025 06:36:18 PM
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక అని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి(Alphores Chairman Narender Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో సోమవారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ పండుగలు మత సామరస్యానికి ప్రత్యేకమైన పండుగలని అన్నారు.
ఆషాడ మాసంలో జరుపుకునేటువంటి ఈ బోనాల పండుగ హైదరాబాదులో నెల రోజుల పాటు వేడుకలు ఆకాశమే హద్దుగా జరుపుకుంటారన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలో ప్రతి సంవత్సరం సాంప్రదాయం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వేడుకల వల్ల విద్యార్థులకు పండుగల పట్ల అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.