07-07-2025 06:15:23 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఆదేశముతో రైతుల సౌకర్యార్ధం నూతనంగా నిర్మించబోయే ఆఫీస్ బిల్డింగ్, టాయిలెట్స్, సీసీ రోడ్డు మొదలగు అభివృద్ధి పనుల నిమిత్తం ఖమ్మం మార్కెటింగ్ డిప్యూటీ ఇంజనీర్ యల్లేష్ తో కలిసి యార్డ్ స్ధలాన్ని ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ రాంబాబు సోమవారం పరిశీలించారు. అనువుగా ఉండే స్థలాన్ని పరిశీలించి అంచనా వేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ జారే సమ్మక్క, మార్కెట్ కార్యదర్శి వి సుచిత్ర, మార్కెట్ గ్రేడ్-3 కార్యదర్శి ఈ నరేష్ కుమార్, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.