07-07-2025 07:11:07 PM
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్(Siddipet Rural) తహసీల్దార్ గా స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ తహసిల్దార్ రాజేష్ ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు గుర్రం అంజిరెడ్డి, పార్టీ నాయకులు మల్లారెడ్డి, పాండు, సదాశివరెడ్డి మధు తదితరులు తహసిల్దార్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వామి మాట్లాడుతూ... ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.