calender_icon.png 1 January, 2026 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించే గొంతుతో బలమైన సమాజం

30-12-2025 12:03:21 AM

గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ 

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): సమాజంలో ప్రశ్నించే గొంతు తయారైనప్పుడు బలమైన సమాజం నిర్మితమవుతుందని, ఆ దిశగానే గోషామహల్  నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర వేదికగా నిలుస్తుందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఉస్మాన్ సాయిలోని శ్రీ జంగల్ విఠో బా దేవాలయంలో, విఠలేశ్వర రుక్మాబాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్తీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అక్కడే ఏర్పాటుచేసిన బస్తీ నిద్ర కుటిర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బస్తీ నిద్ర ద్వారా బస్తీలలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన మౌలిక వసతులు, నిరుపేద విద్యార్థులకు అందించాల్సిన క్రియేటివ్ ఎడ్యుకేషన్, ప్రజా ఆరోగ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం భద్రత, రాజకీయ నవీకరణ తదితర అంశాలపై అవగాహనతో పాటు పరి ష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

తమ వలంటర్లు బస్తీలోకి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, పరి ష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగుతుందన్నారు. త్వరలో గడ్డం పొలిటికల్ అకా డమీని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ అకాడమీ ద్వారా యువతకు విలువలు, సిద్ధాంతాలు, నీతివంతమైన రాజకీయం అం శాలపైన తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

గోషామాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బేగంబజార్ కార్పొరేటర్ జి శంకర్ యాదవ్ అవినీతిలో కూరుకుపోయారని, వేల కోట్ల లో ఆస్తులు సంపాదించారని, త్వ రలో వీరి భరతం పట్టేందుకు తాము క్యారాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులను గద్దె దింపడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమ న్నారు. విఠోబా దేవాల యం అధ్యక్షుడు వి కిషన్ యాదవ్, ఎం మాణిక్ రావు, లక్ష్మణ్, శ్రీనివాస్ యా దవ్, క్రాంతి, ఏం నిర్మల్ కుమార్ యాదవ్, వినోద్, సరస్వతి, హారిక, లతా, పాల్గొన్నారు.