30-12-2025 12:05:15 AM
వాట్సప్‌లో వచ్చే ఆఫర్లు, గ్రీటింగ్స్‌తో జాగ్రత
అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దు
టీజీసీఎస్బీ డైరెక్టర్ షికా గోయల్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల సందడిలో మునిగితేలుతున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బహుమతులు, డిస్కౌంట్ ఆఫర్ల పేరుతో వాట్సాప్ వేదికగా ప్రమాదకరమైన లింకులను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ ఐపీఎస్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ప్రధానంగా మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఇయర్ ఎండ్ ఆఫర్ కింద మీకు రివార్డ్ పాయింట్లు వచ్చాయి. వాటిని నగదుగా మార్చుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మెసేజ్‌ల్లు పంపుతున్నారు. నూతన సంవత్సర కానుకగా మీకు ఉచిత గిఫ్ట్ వచ్చింది, లేదా ఉచిత ప్రయాణ టికెట్లు, ఈవెంట్ పాస్లు గెలుచుకోండి అం టూ ఆశ చూపిస్తున్నారు. న్యూ ఇయర్ విషెస్ వినూత్నంగా చెప్పేందుకు ఒక లింక్ పంపి, ఈ మ్యాజిక్ లింక్ క్లిక్ చేసి మీ పేరుతో విషెస్ చెప్పుకోండి అని ఊరిస్తున్నారు.
ఒక్క క్లిక్‌తో సర్వం స్వాహా.. ఈ లింకుల వెనుక ఉన్నది విషపూరితమైన కుట్ర అని టీజీసీఎస్బీ తెలిపింది. బాధితులు ఆశపడి లింక్‌లు క్లిక్ చేయ గానే, వారికి తెలియకుండానే మొబైల్‌లో ఒక హానికరమైన ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ అవుతుం ది. దీంతో ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. మీ నంబర్ నుంచి మీ స్నే హితులు, కుటుంబ సభ్యులకు నాకు అర్జెంట్గా డబ్బు కావాలిఁ అంటూ మెసేజ్‌లు పంపి వారిని కూడా మోసగిస్తారు.
తెలిసిన వారి నుంచే ముప్పు
ఇలాంటి లింకులు తరచుగా మనకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపుల నుంచే ఫార్వా ర్డ్ అవుతుండటం గమనార్హం. మన వాళ్లే పంపారు కదా అని నమ్మి క్లిక్ చేయడం వల్లే ఎక్కువమంది మోసపోతున్నారని బ్యూరో ఆవేదన వ్యక్తం చేసింది.వాట్సప్, ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే ఎలాంటి గ్రీటింగ్స్, గిఫ్ట్ లింకులను క్లిక్ చేయవద్దు.మెసేజ్ల ద్వారా వచ్చే లింకుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్‌లను ఇన్‌స్టాల్ అప్‌డేట్ చేయొద్దు.
పొరపా టున లింక్ క్లిక్ చేసినా, యాప్ ఇన్‌స్టాల్ చేసి నా వెంటనే మొబైల్ డేటా, వైఫై ఆఫ్ చేయా లి. ఆ అనుమానాస్పద యాప్‌ను అన్-ఇన్ స్టాల్ చేయాలి. వెంటనే బ్యాంకుకు సమాచా రం అందించి ఖాతాను తాత్కాలికంగా స్తం భింపజేయాలి. సైబర్ మోసానికి గురైన బాధితులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుం డా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలి. లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని షికా గోయల్ స్పష్టం చేశారు.