21-10-2024 03:12:02 PM
హుజూర్ నగర్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల గౌరవార్థం ప్రతీ ఏటా అక్టోబర్ 21న దేశంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని శాంతి స్థూపం వద్దకు ర్యాలీగా వెళ్లి నివాళులు అర్పించిన పోలీసులు, పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు.