calender_icon.png 23 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్ @ 29 వేల కోట్లు!

23-01-2026 01:29:58 AM

తెలంగాణకు పెట్టుబడుల వరద

  1. మూడోరోజు గ్లోబల్ కంపెనీలతో కీలక ఒప్పందాలు 
  2. ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ 
  3. 5వేల పెట్టుబడికి ముందుకొచ్చిన యూపీసీ వోల్ట్ 
  4. డెయిరీ విస్తరణ, హౌసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌తో చర్చ
  5. రూ. 623 కోట్ల పెట్టుబడికి స్నైడర్‌తో ఎంఓయూ

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 దావోస్ సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం దావోస్ పర్యటనలో ఇప్పటివరకు సుమారు రూ. 29 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. స్టీల్, లైఫ్ సైన్సెస్, ఏఐ, ఏరోస్పేస్, క్లీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ ఆసక్తి వ్యక్తమైంది.

దావోస్‌లో తెలంగాణకు ఇప్పటికే అతిపెద్ద పెట్టుబడి హామీగా రష్మి గ్రూప్ ముం దుకొచ్చింది. రూ. 12,500 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రా ష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి ఇది కీలక మైలురాయిగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఏరోస్పేస్ ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్) యూనిట్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.

కాలిఫోర్నియాకు చెందిన బ్లేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత టెక్నాలజీల్లో తెలంగాణతో సహకారానికి ముందుకొచ్చింది. హైదరాబాద్‌ను ఏఐ హ బ్‌గా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు కీలకంగా మారనున్నాయి. స్లోవాకియాకు చెంది న న్యూక్లర్ ప్రొడకట్స్ సంస్థ సుమారు రూ. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మా డ్యులర్ రియాక్టర్(ఎస్‌ఎంఆర్) ఆధారిత క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఈవోఐ సమర్పించింది. ఇది పూర్తిస్థాయి పెట్టుబడిగా మారితే తెలంగాణ క్లీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే ముందంజ లో నిలవనుంది.

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లొరియల్ రూ. 3,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్లోబల్ బ్యూటీ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,000కు పైగా హై-స్కిల్ ఉద్యోగాలు కలగనున్నాయి. దావోస్ పర్యటన ద్వారా తెలంగాణ ప్రభుత్వం ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ స్టేట్’గా గ్లోబల్ స్థాయిలో తన బ్రాండ్‌ను మరింత బలపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఫోర్త్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్

దేశంలోనే  తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూడో రోజు గురువారం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్‌లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్  ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.   

స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ

రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కం పెనీ తమ యూనిట్లను విస్తరించనుంది. శం షాబాద్, గాగిల్లాపూర్‌లో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక-2026లో సీఎం రేవం త్ రెడ్డి స్నైడర్ కంపెనీ సీఈవో దీపక్ శర్మతో సమావేశమయ్యారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టు లు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రీయల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరుగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నా యి. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయా రీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై మంత్రులు చర్చించారు. 

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌కు అపూర్వ స్పందన 

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫో రం-2026 సమావేశాల్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్)కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభిం చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ద్వారా తెలంగా ణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం అందించనుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెం ట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది.  జార్జ్‌టౌన్ యూ నివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కు దుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య రంగంలో ఏ ఐ ఆధారిత పరిశోధనలు, శిక్ష ణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అలా గే దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్‌తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ఏఐ శిక్షణ అందించి భవిష్యత్ తరాలకు నైపుణ్యం కలిగిన రాష్ట్రం గా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  సంజయ్ కుమార్ ఉన్నారు. 


హైదరాబాద్‌లో డెయిరీ విస్తరించాలి: గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌కు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి

ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రేజ్ క్రీమ్లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ  నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కూడా మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. నాదిర్ గోద్రేజ్‌ను హైదరాబాద్‌కు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.