calender_icon.png 23 January, 2026 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ చేయి పెడితే.. కాంగ్రెస్ కాలు పెడుతోంది

23-01-2026 12:43:32 AM

  1. సింగరేణి సంస్థను భ్రష్టు పట్టిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  2.   48 వేల కోట్ల బకాయి చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం
  3. సింగరేణిని గాడిన పెట్టేందుకు పోరాటాలకు సిద్ధం 
  4. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య  
  5. రామగుండంలో గేట్ మీటింగ్ 

గోదావరిఖని, జనవరి 22 (విజయక్రాం తి): సింగరేణిలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయి పెడితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాలు పెట్టి సింగరేణి సొమ్మును దుబారా చేస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. సింగరేణి సంస్థను తమ జేబు సంస్థగా వాడుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నాయని, సింగరేణిని గాడిన పెట్టేందుకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని గుర్తింపు సంఘమైన పేర్కొన్నారు.

గురువారం సింగరేణి రామగుండం--1 ఏరియాలోని జీడీకే- 2వ బొగ్గు గనిపై జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అలాగే గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థ 2014కు ముందు బాగానే ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల యూనియన్‌లను డమ్మి చేసి సర్పంచుల దగ్గర నుంచి మంత్రుల వరకు పైరవీలు చేసుకొనేందుకు స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించారు.

దీంతో సంస్థకు రావాల్సిన 26 వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగరేణి బకాయిలు ఇంకా పెరిగి నేడు అవి రూ.48 వేల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. సింగరేణిలో కొత్త గనులు రావాలన్న, వచ్చిన వాటిని తవ్వాలన్న డబ్బు అవసరం అని, బకాయిలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా కొత్త గనులు ఎట్లా తవ్వతారని ప్రశ్నించారు.

సింగరేణిలో గత ప్రభుత్వం చేయి పెడితే ఈ ప్రభుత్వం కాలు పెట్టి సింగరేణి సొమ్మును దుబారా చేస్తూ సంస్థకు, కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సంస్థ సి అండ్ ఎండి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండటం వల్ల నేడు సింగరేణి పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని పేర్కొన్నారు. సింగరేణి లో బొగ్గు టెండర్ ప్రక్రియలో మంత్రుల మధ్య పోటీ వల్ల రాష్ర్టంలో రచ్చ జరిగిందని, వాటిని రద్దు చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించి నైని బొగ్గు బ్లాక్‌ను నడిపించాలని సూచించారు.

సింగరేణిలో ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు చెందిన మంత్రులు పట్టించుకోకుండా సంస్థ ను బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందని, వీటి అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని, దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు లేబ ర్ కోడ్ అమలు అవుతాయని, దీని వల్ల బొగ్గు పరిశ్రమలో గతంలో జీతాలు పెంచాలంటే వేజ్ బోర్డు ఒప్పందాలు జరిగాయని ఇక నుంచి లేబర్ కమిషన్ వేసి జీతాలు ఎంత పెంచాలో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. లేబర్ కోడ్ ల వల్ల కార్మిక వర్గం కు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి 12 న సార్వత్రిక సమ్మె కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, సింగరేణి లో కూడా సమ్మె చేయాలని ఆయన కార్మికులను కోరారు. 

‘సైట్ విజిట్’ నిబంధనతోనే అవినీతికి తెర

సింగరేణిలో నైని బ్లాక్ టెండర్ ప్రక్రియలో మంత్రుల మధ్య పోటీ వల్ల రచ్చ జరిగిందని, దీనిలో ఒక ఐఏఎస్ అధికారిని ఇబ్బందులకు గురి చేసి రాష్ట్ర ప్రభుత్వం బద్నాం అయిందని తెలిపారు. టెండర్ ప్రక్రియలో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంటేనే టెండర్‌లో పాల్గొనాలని నిబంధన పెట్టడం ద్వారా అవినీతికి తెరలేపినట్టయిందని అభిప్రాయపడ్డారు. ఈ టెండర్‌ల ను రద్దు చేసి పారదర్శకంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.

సంస్థలో రాజకీ య జోక్యాన్ని అరికట్టాలని, సంస్థకు రావాల్సిన 49 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూ సీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, వై.వి.రావు, బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు ఎస్ వెంకట్‌రెడ్డి, సిర్ర మల్లికార్జు న్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం పాషా, పర్లపెల్లి రామస్వామి, ఎరవెల్లి రాజయ్య, గొడిశల నరేశ్ పాల్గొన్నారు.