calender_icon.png 23 January, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీలో పైసల పంచాయితీ

23-01-2026 12:00:00 AM

అమ్మ ఇవ్వదు అడుక్కొనివ్వదు అనే చందాగా మారింది గ్రామ పంచాయతీల బడ్జెట్. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కి సంబంధించిన నిధులు జిపి ఖాతాలో జమ చేసింది. 2004లోని గ్రామపంచాయతీల పాలకవర్గం ముయ్యగా 2023 ఆర్థిక సంవత్సర సంబందించిన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు గ్రామపంచాయతీలో చిచ్చు రేపుతున్నాయి. కొత్తగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి పరిపాలన సాగిస్తున్న తరుణంలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల  ఖర్చుల విషయంలో కొత్త పైసల పంచాయతీ  చిచ్చు రేపుతోంది.

  1. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
  2. జిల్లాకు రూ 7.57 కోట్ల నిధులు
  3. పాత బిల్లుల కోసం ఒకరు.. కొత్త పనులకు కోసం ఇంకొకరు
  4. మా ఖర్చు సంగతి ఏంటని కార్యదర్శుల ప్రశ్నలు..

కుబీర్, జనవరి ౨౨ (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఖాతాలో జమైన నిధులు తాము సర్పంచ్ బాధ్యత ఉన్న సంబంధిత నిధులు కావడంతో తాము చేపట్టిన పనులకు నిధులు విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు గ్రామపంచాయతీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో తాము గ్రామపం చాయతీలో గెలిచామని తమ హయాంలో నిధులు మంజూరు కావడంతో ఆ నిధులు వినియోగంపై తమకు సర్వ హక్కులు ఉంటాయని కొత్త సర్పంచులు అడ్డు పూల వేస్తున్నా రు.

దీనికి తోడు గ్రామపంచాయతీలో పాలకవర్గ మూసి రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గం ఏర్పాటు అయ్యేవరకు గ్రామపంచాయతీ నిర్వాహణకు తాము కొంత బడ్జెట్ ఖర్చు చేశామని తమకే ఆ నిధులు ఇవ్వాలని గ్రామ కార్య దర్శులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

గ్రామపంచాయతీలో జమైన నిధుల విషయం లో కొత్త పాత సర్పంచులతోపాటు ఆ పంచాయతీకి కార్యదర్శిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎవరికి వారి నిధుల వినియోగం విషయంలో పోటీ పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం జిల్లాకు కేటాయించిన నిధుల ఖర్చు విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఎవరికి ఇవ్వకపోవడంతో నిధులు వచ్చిన ఉపయోగించుకునే పరిస్థితి లేదు.

నిర్మల్ జిల్లాకు 7.57 కోట్ల నిధులు

నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా పంచాయతీ డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో మొత్తం 400 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ పం చాయతీలో 2023 ఆర్థిక సంవత్సర సంబందించిన 15వ ఆర్థిక సంఘం రెండో విడుత నిధులు విడుదలయ్యాయి. జిల్లాకు మొత్తం రూ 7.57 కోట్లు ప్రభుత్వం విడుదల చేసి గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేసిం ది. ఇందులో బాసరలోని పది జీపీలకు రూ 26.86 లక్షలు బైంసాలోని 30 జీపీలకు  55.03 లక్షలు, కస్తురాబాద్ నుంచి 13 జీపీ లకు 29.96 లక్షలు, దిల్వార్పూర్ మండలంలోని 12 జీపీలకు 30.47 లక్షలు, నిధులు మంజూరు అయ్యాయి.

కడెం మండలంలోని 29 జీపీలకు రూ.50,43 లక్షలు, ఖానాపూర్ మండలంలోని 25 జీపీలకు రూ.39.62 లక్షలు, కుబీర్ మండలంలోని 42 జీపీలకు రూ.67.49 లక్షలు, కుంటాల మండలంలోని 15 జీపీలకు రూ.32.46 లక్షలు, లక్ష్మణ చందా మండలంలోని 18 జీబీలకు రూ.42.17 లక్ష లు, లోకేశ్వరం మండలంలోని 25 జీపీలకు రూ.49.85 లక్షలు, నిధులు మంజూరు అయ్యాయి. మామడ మండలంలోని 27 జీపీలకు రూ.44.83 లక్షలు, ముధోల్ మండలం లోని 19 జీపీలకు రూ.48.44 లక్షలు, నర్సాపూర్ మండలంలోని 13 జీపీలకు రూ.32.71 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి.

నిర్మల్ రూరల్ మండలంలోని 20 జీపీలకు రూ.35 42 లక్షలు, పెంబి మండలంలోని 24 జీపీలకు రూ.19.25 లక్షలు, సారంగాపూర్ మండలంలోని 32 జిపిలకు రూ.39.94 లక్షలు, సోల్ మండలంలోని 14 జీపీలకు రూ.39.94 లక్ష లు, తాండూరు మండలంలోని 32 జిపిలకు రూ.55.88 లక్షల రూపాయల నిధులను గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేసినట్టు పంచాయతీ అధికారులు తెలిపారు

మార్గదర్శకాలను సూచించినప్పటికీ..

రెండు సంవత్సరాల తర్వాత గ్రామపంచాయతీకి నిధులు విడుదల కావడం పం చాయతీలో కొత్త పంచాయతీ ఏర్పడింది. ఈ నిధులు తాము సర్పంచ్‌గా ఉన్న సంబంధించిన కావడంతో ఆ నిధులు గ్రామపంచాయతీ అభివృద్ధికి తాము చేపట్టిన పెండింగ్ బిల్లులకు కేటాయించాలని అప్పటి సర్పంచులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం చెప్తేనే గ్రామపంచాయతీలో తాము పనులు చేశామని ఆ పను ల పెండింగ్ బిల్లు రెండేళ్లుగా రాకపోగా తమ సర్పంచ్ పదవి కూడా పోయిందని ఆ నిధులు తమకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

గత నెలలో తాము కొత్త సర్పంచ్ లు గా ప్రజల చేత ఎన్నుకోబడ్డామని ప్రభుత్వం కొత్తగా నిధులు విడుదల చేయడంతో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమ లు చేసేందుకు ఈ నిధులు తమకే కేటాయించే విధంగా చూడాలని కొత్త సర్పంచ్లు కోరుతున్నారు. గ్రామ పంచాయతీలకు రెండు సంవ త్సరాలుగా పాలకవర్గం లేకపోవడంతో పంచాయితీలో బోర్ల రిపేరు విద్యుత్ బల్బులు ఇతర మెయింటెనెన్స్లు నిర్వహణ ఖర్చులు అధికారులు తమ చేత పెట్టించారని ఆ బిల్లులను చెల్లించేందుకు ఈ నిధులు తమకు డ్రా చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని గ్రామ కార్యదర్శులు పట్టుబడుతున్నారు. 

ఇప్పటికీ అన్ని గ్రామపంచాయతీలో ఒక్కొక్క కార్యదర్శి జేబులో నుండి రెండున్నర నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు చేసినట్టు ఆధారాలు చూపెడుతున్నారు. నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గద ర్శకాలను సూచించినప్పటికీ సర్పంచు మాజీ సర్పంచ్ గ్రామ కార్యదర్శులు నిధుల విషయంలో పంచాయతీ పెట్టుకోవడంతో గ్రామాల్లో ఆర్థిక సంఘం నిధుల వివాదం కొత్త సమస్యలకు దారితీస్తోంది ఈ విషయం జిల్లా పంచాయతీ అధికారి వెళ్లినట్టు వారు పేర్కొంటున్నారు.

త్వరలో స్పష్టత ఇస్తాం..

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన 15వ ఆర్థిక సంఘం రెండో విడత కింద నిధులను మంజూరు చేసిం ది. జిల్లాలోని 18 మండలా పరిధిలో 400 జీపీలకు రూ 7.57 కోట్లను విడుదల చేసింది పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ఆ నిధుల విడుదల విషయంలో త్వరలో స్పష్టత వస్తుందని గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆ నిధులను వినియోగించుకోవాలి.

శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి