calender_icon.png 23 January, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరు కొనసాగేనా?

23-01-2026 12:31:46 AM

  1. నేడు కివీస్‌తో రెండో టీ20
  2. సిరీస్ ఆధిక్యంపై భారత్ కన్ను
  3. సమం చేసేందుకు కివీస్
  4. అక్షర్ పటేల్ ఔట్-కుల్దీప్ ఇన్

రాయ్‌పూర్ జనవరి 22 : వన్డే సిరీస్ పరాభవం నుంచి త్వరగానే కోలుకుని టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. రాయ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నాగ్ పూర్ లో అభిషేక్ శర్మ విధ్వంసం, రింకూ సింగ్ మెరుపులతో భారీస్కోరు సాధిం చి కివీస్ ను చిత్తు చేసిన భారత్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అయితే గాయం కారణంగా అక్షర్ పటేల్ దూరమవడం ఎదురుదెబ్బగానే చెప్పాలి.

తొలి టీ ట్వంటీలో బౌలింగ్ చేస్తుండగా  తుది జట్టులో కుల్దీప్ కు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తొలి టీ ట్వంటీలో బ్యాటింగ్, బౌలింగ్ లో భారత్ అదరగొట్టింది. అయితే ఫీల్డింగ్ మాత్రం టెన్షన్ పెడుతోంది. నాగ్‌పూర్‌లో భారత జట్టు ఫీల్డింగ్ స్థాయికి తగినట్టు లేదు. రనౌట్ తో పాటు పలు క్యాచ్ లు వదిలేశారు. భారీస్కోరును టార్గెట్‌గా నిర్థేశిం చడంతో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఒకవేళ కొంచెం తక్కువ స్కోరు ఉండి ఉంటే అదే ఫీల్జింగ్ మ్యాచ్‌ను శాసించేది.

ఈ నేపథ్యంలో క్యాచ్ లపై మన క్రికెటర్లు మరింతగా ఫోకస్ పెట్టాలని భారత మాజీలు సూచిస్తున్నారు. భారత జట్టు కూర్పులో బ్యాటింగ్ విషయానికొస్తే అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉండగా.. సంజూ శాంసన్ తన బలహీనతను ఇంకా వీడలే దు. రెండో వన్డేలోనైనా సంజూ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అంతా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇషాన్ కిషన్ కూడా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటు సూర్యకు మార్ యాదవ్ చాలారోజుల తర్వాత ఫామ్ అందుకున్నాడు. 

అయితే తన మెరుపులను భారీ ఇన్నింగ్స్ గా మలచలేకపోయాడు. ఇక హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్ తమపై ఉన్న అంచనాలను అందుకున్నారు. ముఖ్యంగా రింకూ సింగ్ చాలా రోజుల తర్వాత ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతులూ ఒడిసిపట్టుకున్నాడు. 20 బంతుల్లోనే 44 రన్స్ చేసిన రింకూ ఫినిషర్ రోల్‌ను బాగానే పోషిస్తున్నాడు. ఇక శివమ్ దూబే కూడా ఫామ్ అందుకుంటే మరోసారి కివీస్ బౌలర్లకు చుక్కలే. 

అటు బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ , హార్థిక్ పాండ్యా రాణించగా.. బుమ్రా తొలి మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి , దూబే కూడా బంతితో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లో ఓడినా న్యూజిలాం డ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వన్డే సిరీస్ లో సైతం తొలి మ్యాచ్ ఓడి తర్వాత అద్భుతంగా పుంజుకుని సిరీస్ ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఐదు మ్యాచ్ ల సిరీస్ కావడంతో భారత్ కు ఆధిక్యం పెంచుకునేందుకు, సిరీస్ గెలుపుకు మరింత చేరువయ్యేందుకు ఇది మంచి అవకాశం. దీంతో ఎట్టిపరిస్థితుల్లో నూ పుంజుకుని సిరీస్ సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఇక టీ20 ప్రపంచకప్ కు ముం దు ఇరు జట్లకు ఇదే చివరి సిరీస్ కావడంతో టీమ్ కాంబినేషన్ ను సెట్ చేసుకోవడంతో పాటు కీలక ఆటగాళ్లంతా ఫామ్ అందుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. 

తుది జట్లు అంచనా 

భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా,. రింకూ సింగ్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్షదీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ : రాబిన్‌సన్, కాన్వే(కీపర్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, జిమ్మీ నీషమ్, మిఛెల్ శాంట్నర్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ