31 August, 2026 | 2:33 AM

వెయ్యి రోజులు.. వేల ప్రశ్నలు

31-08-2026 12:00 AM

కాంగ్రెస్ ప్రభుత్వంపై గాదరి కిషోర్ కుమార్ ఫైర్

తిరుమలగిరి (మోత్కూర్) ఆగస్టు 30 : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వరుస నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తుంగతుర్తి నియోజకవ ర్గంలో చేపట్టనున్న కార్యక్రమాలపై పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మందితో నిరసన ర్యాలీ చేపడతామన్నారు.

కృష్ణా జలాలపై సెప్టెంబర్ 3న మిర్యాలగూడ వేదికగా ఎడమ కాలువ పరిధిలోని రైతుల సమస్యలపై చేపట్టే ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారన్నారు  సెప్టెంబర్ 4న తిరుమలగిరి లో వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలపై సదస్సు నిర్వహిస్తామన్నారు సెప్టెంబ ర్ 6న గ్రామశాఖల ఆధ్వర్యంలోను సెప్టెం బర్ 7న అన్ని మండల కేంద్రాల్లో ప్రజావా ణి వినతి పత్రాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. 

సెప్టెంబర్ 8న జిల్లా కేంద్రంలో నిరసన అ నంతరం  అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తామని వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, విద్యుత్, ఎరువుల రైతుబీమాకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో అర్హులైన కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సాయం అందడం లేదన్నారు. 22ఏ భూముల సమస్యపై తీవ్ర ఆరోపణలు రాష్ట్రంలో 22ఏ భూముల సమస్యను ప్రభుత్వం తీవ్రంగా జఠిలం చేసిందని  ఆరోపించారు. 

 97వ జీవోపై అభ్యంతరం :

విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. 97వ జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. స్కిల్‌యూనివర్సిటీ, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభు త్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

 మున్సిపాలిటీల్లో నిధుల వినియోగంపై ప్రశ్నలు :

మోత్కూర్, తిరుమలగిరి మున్సిపాలిటీ ల్లో జరుగుతున్న పరిణామాలపైనా  స్పం దించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపాలిటీల అభివృద్ధికి ని ధులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం మంజూరైన నిధులు ఏ విధంగా వినియోగిస్తున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డి మాండ్ చేశారు.  ఈ విలేకరుల  సమావేశం లో రాష్ట నాయకులు, అన్ని మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.