22-01-2026 12:00:00 AM
అప్రమత్తంగా ఉండాలని ఆటవీ అధికారుల సూచన
ఆశ్వారావుపేట, జనవరి 21(విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కాపడిగుండ్ల అటవీప్రాంతంలో పెద్ద పులి సంచారంతో సమీప గ్రామాలు తీవ్ర భయాందోళనకు గురుపుతున్నాయి. కావడిగుండ్లలో రెండు ఆవులను చంపిన పెద్దపులి చెన్నాపురం గొత్తికోయల కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి మరో ఆవును చంపినట్లుగా ప్రచారం జరిగింది.
దీంతో పెద్దపులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందనే సమాచారంతో గిరిజన గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. అటవీప్రాంతం నుంచి గ్రామాల్లోకి వస్తుందనే అనుమా నంతో అందరూ భయం భయంగా ఉంటున్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో బుధవారం అశ్వారావుపేట పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.ఎస్‌ఐ యయాతిరాజు, రేంజర్ మురళీలు తమ సిబ్బంది.
గ్రామస్తులతో కలిసి పులి సంచరించిన ప్రాంతంలో అడుగు జాడలను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాలవారికి పలు సూచనలు చేశారు. పశువులను అటవీ ప్రాంతానికి మేతకు తొలుకెళ్ల వద్దని సూచించారు.ఆటవీప్రాంతంలో నివాసం ఉండే వారు చాలా అప్రమత్తంగా ఉంచాలని తెలిపారు. పెద్ద పులి కదలికలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని రేంజర్ మురళీ కోరారు. తమ సిబ్బంది కొద్దిరోజుల పాటు ఉంటారని, ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు.