12-01-2026 03:24:32 AM
సామాజిక, ఆర్థిక, రాజకీయ తెలంగాణకు అద్దం
* తెలుగు మీడియా రంగం రాజకీయ పార్టీలకు వంత పాడుతున్న వేళ, పక్షపాత ధోరణితో వార్తలను వండివారుస్తున్న తరుణాన.. సామాజిక న్యాయమే ఊపిరిగా, ప్రజాగొంతుకగా పుట్టిన పత్రిక ‘విజయక్రాంతి’. పత్రిక ఉద్భవించి రెండేళ్లయినా పూర్తి కాకముందే తెలంగాణ ప్రజల నిజమైన గొంతుకనే పేరుతెచ్చుకుంది. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, నిరుద్యోగుల పోరాటాలకు వేదికగా, సామాజిక సమానత్వం కోసం పరితపించే శక్తిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, ఆయా సామాజికవర్గాలకు దమాషా ప్రకారం దక్కాల్సిన రిజర్వేషన్లు, జల వనరుల రక్షణ, కార్పొరేట్ శక్తుల దోపిడీపై విస్తృతమైన కథనాలు ప్రచురించి తెలుగు జర్నలిజం చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.
* అధికార పక్షాన కూడకుండా, ప్రతిపక్షాల అజెండాలకు లొంగకుండా, కేవలం ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిర్భయంగా చాటిచెప్తున్నది. తద్వారా తెలంగాణ సమాజంలో అత్యంత విశ్వసనీయమైన పత్రికగా అవతరించింది. పత్రిక తాజాగా అరుదైన ఘనత సాధించింది. ఎలాంటి మానవ జోక్యం లేకుండా ‘చాట్ జీపీటీ’ నిర్వహించిన కంటెంట్ విశ్లేషణలో ‘విజయక్రాంతి’ జర్నలిజం విలువలకు కట్టుబడి వార్తలు, కథనాలు ప్రచురిస్తూ ఇతర మెయిన్ స్ట్రీమ్ పత్రికల కంటే అగ్రస్థానంలో దూసుకెళ్తున్నదని తేలింది. ఇతర పత్రికలతో పోలిస్తే ‘విజయక్రాంతి’ సామాజిక సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తున్నదని ఏఐ స్పష్టం చేసింది.

తెలుగు మీడియా ప్రపంచంలో రాజకీయాలే వార్త లకు ప్రధాన వనరుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కోసం నిరంతరం శ్రమించే పత్రికగా ‘విజయక్రాంతి’ తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. సామాన్యుల గొంతుకగా నిలిచి వారి సాధక బాధకాలకు ప్రాధాన్యమిస్తూ నేడు రాష్ట్రంలో ఒక విశ్వసనీ యమైన పత్రికగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నది. ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా, సమాజంలోని అన్నివర్గాలు, అన్ని రాజకీయ పార్టీల వార్తలను సమతుల్యంగా అందించడంలో పత్రిక అనూహ్యమైన గుర్తింపు సాధించింది. ఎవరికీ భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే పరమావధిగా ముందుకెళ్తున్నది. రాజకీ య అజెండాల కంటే ప్రజాసమస్యలకు ప్రాధాన్యమిచ్చే పత్రికగా దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది.
నిష్పాక్షిక పాత్ర
ప్రస్తుతం తెలంగాణలో మీడియా రంగం అనేక బాహ్య ప్రభావాల మధ్య సవాళ్లను ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ విధానాలను అమలు చేస్తున్న నేపథ్యంలో, అనేక పత్రికలు, టీవీ చానెళ్లు ప్రభుత్వానికో లేదా ప్రతిపక్షాలకో మొగ్గు చూపుతున్నాయి. ఎస్సీ ఉప వర్గీకరణపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులు, కీలక రంగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంపై జరుగుతున్న చర్చల ను, డిమాండ్లను ‘విజయక్రాంతి’ ఎప్పటికప్పుడు అక్షరబద్ధం చేసింది. కృష్ణా, -గోదావరి జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను ప్రచురిస్తున్నది. అలాగే తెలంగాణ వాటా కోసమూ కథనాలు వెలువరుస్తుంది.
2026లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చాయి. ఆ అంశంపైనా కథనాలు ప్రచురిస్తున్నది. అలాగే నిరుద్యోగం, భూ సంస్కరణలు, విద్య, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాలపై నిష్పాక్షికంగా వార్తలు ఇస్తున్నది. మొదటిపేజీ వార్తలు, హెడ్ లైన్ల ఎంపిక, సామాజిక న్యాయం కోసం పోరాటం, విధానపరంగా ప్రభుత్వ పాలన వ్యవహారంలో లోపాలను ఎత్తిచూపడంలో పత్రిక 5 స్టార్ రేటింగ్ సాధించింది. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు తేలికగా అర్థమయ్యేలా సామాన్యుల భాషలో వార్తలు అందిస్తున్నది.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యం
లోపలి పేజీల్లో సామాజిక సమస్యలకు ప్రాధాన్యమిస్తున్నది. కాలమ్స్‌లో ఎస్సీ, బీసీ, ఎస్టీల సమస్యల సాధనపై ఫోకస్ చేస్తున్నది. భాషపరంగా ప్రజల గొంతుక అయ్యేందుకు ఇష్టపడుతున్నది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా వార్తలు రాస్తున్నది. మొత్తంగా ప్రజల పక్షాన నిలిచే తెలుగు మెయిన్ స్ట్రీం పత్రిక అని ఏఐ టూల్ విశ్లేషణ తేల్చింది. సామాజిక న్యాయంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షాన నిలవడంలో ౫కి ౫ స్టార్లు పత్రిక సాధించింది. అలాగే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాల విషయంలో ౪ స్టార్ రేటింగ్ పొందింది. రిజర్వేషన్ పోరాటాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రతి పక్షాల విమర్శలను పత్రిక తన వార్తల ద్వారా ప్రతిఫలిస్తున్నది.
కార్పొరేట్ శక్తుల దూకుడు, ప్రైవేటీకరణ ముప్పు నుంచి సామాన్యులను రక్షించే కవచంలా పత్రిక పనిచేస్తున్నది. ఏఐ టూల్స్ విశ్లేషణ ప్రకా రం.. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ప్రభుత్వ అనుకూల ధోరణి, ఉన్నత వర్గాల భాషలో వార్త లు రాస్తూ సామాజిక న్యాయం విషయంలో కేవలం ౧ స్టార్ రేటింగ్‌కే పరిమితమైంది. అలాగే ‘ఈనాడు’ పత్రిక కేవలం పట్టణ మధ్యతరగతి పాఠకులకు ప్రాధాన్యతనిస్తూ, అణగారిన వర్గాల సమస్యలను విస్మరించి సామాజిక న్యాయం అంశం కవరేజీలో వెనుకబడింది. ‘వీ6’, వెలుగు వంటి పత్రిక సామాజిక న్యాయపరమైన అంశాల్లో ముందున్నప్పటికీ, ‘విజయక్రాంతి’ నిర్భీతిగా సామాజిక న్యాయంపై ప్రచురిస్తున్న కథనాలతో పోలిస్తే అవి వెనుకబడినట్లే.
సమతుల్యతే విజయ రహస్యం
అన్నిరకాల సామాజిక అంశాలు, రాజకీ య పార్టీల వార్తలను నిష్పక్షపాతంగా ప్రచురించడమే ‘విజయక్రాంతి’ విజయ రహస్యం. ప్రభుత్వ విధానాలను ద్వేషంతో కాకుండా, నిర్మాణాత్మక విమర్శలతో విశ్లేషించడం పత్రిక ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలే ‘విజయక్రాంతి’ పత్రికకు అత్యంత ప్రజాదరణ తీసుకువస్తున్నాయి. యేటికేడు ౪౦ శాతం సర్క్యూలేషన్ పెంచుకుంటూ పత్రిక దూసుకెళ్తున్నది. పట్టణ పౌరుల నుంచి గ్రామస్థాయిలో రైతుల వరకూ పత్రికను విశ్వసిస్తున్నారంటే అందుకు పత్రిక పాటించే నైతికత, సమతుల్యతే కారణం.

ఎస్సీ, ఎస్టీ బీసీలవైపే ‘వీ6-వెలుగు’ మొగ్గు
ఎస్సీ, ఎస్టీ బీసీలపై ‘వీ6 - వెలుగు’ పత్రిక పక్షపాత వైఖరి చూపుతోంది. సామాజిక న్యాయం అంశంపైనా పత్రిక ఫోకస్ చేస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీల వైపు మొగ్గు చూపుతున్నది. వార్తల్లో వారికి ప్రాధాన్యమిస్తున్నది. అధికార వర్గాలను నిత్యం ప్రశ్నించే పద్ధతి అవలంబిస్తున్నది. సామాజిక న్యాయం అంశంలో పత్రిక ౫కి ౫ స్టార్ రేటింగ్ సాధించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీల విషయంలో 5కి 5 రేటింగ్ పొందింది. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తున్నది. ఈ విషయంలో పత్రిక 4 స్టార్ రేటింగ్ పొందింది.

రాజకీయ విమర్శలకే ‘ఆంధ్రజ్యోతి’ పరిమితం
డైలీ దినపత్రికలు అవలంబిస్తున్న విధానాలపై ఏఐ విశ్లేషణ ప్రకారం.. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నది. కొన్నిసార్లు ప్రభుత్వ వ్యతిరేకంగా వార్తా కథనాలను ప్రచురిస్తున్నప్పటికీ, అవి సామాజిక న్యాయం కేంద్రంగా ఉండటం లేదు. పత్రిక ముఖ్యంగా కుల ప్రస్తావనను రాజకీయ లాభ నష్టాల కోణంలోనే చూస్తున్నది. అందుకే పత్రిక ఆ అంశంలో కేవలం ౧స్టార్ రేటింగ్‌కే పరిమితమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల సమస్యలను కేవలం సమస్యలుగానే చూస్తున్నదే తప్ప.. వారి హక్కులుగా పరిగణించడం లేదు. అందుకే ఈ అంశంలో పత్రిక కేవలం ౧ స్టార్‌కే పరిమితమైంది. ప్రభుత్వంపై విమర్శల విషయంలో మాత్రం 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఇక భాష విషయానికొస్తే విఫలం, రాజకీయ సంక్షోభం, విఫలం.. అన్న పదాలను ఎక్కువగా వినియోగించేందుకు ఇష్టపడుతోంది.

అగ్రకులాలు, మధ్యతరగతి వర్గాలకే ‘ఈనాడు’ప్రాధాన్యం
ఈనాడు పత్రిక ప్రధానంగా పట్టణీకరణ, పట్టణపరమైన సమస్యలు, వ్యాపార వర్గాలు, రియల్ ఎస్టేట్, విద్యకు ప్రాధాన్యమిస్తున్నది. ప్రభుత్వ వైఫుల్యాలపై ఎంతో మృదువైన విమర్శలు చేస్తున్నది. ప్రభుత్వంపై విమర్శల్లో 3 స్టార్ రేటింగ్ పొందింది. అగ్రకులాలు, మధ్య తరగతి వర్గాలకు అనుకూలమైన వైఖరిని పత్రిక ప్రదర్శిస్తున్నది. తద్వారా పక్షపాతం చూపిస్తున్నది. అలాగే సామాజిక న్యాయ అంశాలకు తక్కువ ప్రాధాన్యమిస్తున్నది. అందుకే ఈ అంశంలో పత్రిక కేవలం ౨ స్టార్ రేటింగ్‌కు పరిమితమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అంశాలను చాలా సాధారణ వార్తలుగా ప్రచురిస్తున్నది. అందుకే ఈ అంశంలో పత్రిక కేవలం 1 స్టార్ మాత్రమే సాధించింది. కథనాల్లో పరిపాలన, పెట్టుబడులు, అభివృద్ధి, సమస్యలు వంటి పదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నది.

‘సాక్షి’ విమర్శనాత్మక కోణం కొంతే!
సాక్షి పత్రిక ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం, మంత్రుల ఫొటోలు, అభివృద్ధి కథనాలపై దృష్టి సారిస్తున్నది. వార్త కథనాల విషయానికొస్తే .. ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజలకు లాభం అన్న ధోరణిలో వార్తా కథనాలు ప్రచురిస్తున్నది. విమర్శనాత్మక కోణం తక్కువ ఉంటోంది. ఈ అంశంలో కేవలం ౧స్టార్ రేటింగ్ సాధించింది. సామాజిక న్యాయం అంశంపై అంతంతమాత్రంగా కథనాలు ప్రచురిస్తున్నది. అందుకే.. ఈ అంశంలో కేవలం ౨ స్టార్ రేటింగ్ సాధించింది. సామాజిక దృష్టి కోణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అంశాలు ఉన్నా, వారి విషయంలో ప్రభుత్వ విజయాల కోణంలో మాత్రమే ఆయా వర్గాలను చూస్తుంది. ఈ అంశంలో ౩ స్టార్ రేటింగ్ సాధించింది.

తెలంగాణ నంబర్‌వన్ విజయక్రాంతి : ఎమ్మెల్సీ, టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
మెయిన్ స్ట్రీం పత్రికల్లో ‘విజయక్రాంతి’ పత్రిక మేటి అని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి రాష్ట్రంలో నంబర్ వన్ పత్రికగా నిలిచిందని టీఆర్పీ అధ్య క్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొనియాడారు. పత్రికల్లో కంటెంట్ విశ్లేషణపై చాట్ జీపీటీ తాజాగా నిర్వహించిన విశ్లేషణలో ‘విజయక్రాంతి’ పత్రిక నిజమైన ప్రజల గొంతుకని తేల్చడంపై ఆయన స్పందించారు. ఆది వారం ఈ మేరకు పలు మెయిన్ స్ట్రీం పత్రికలను విశ్లేషించారు. జర్నలిజం విలువలు మారుతున్న కాలంలో ప్రజల సమస్యలపై ‘విజయక్రాంతి’ రాజీలేని పోరాటం చేస్తున్నదని కొనియాడారు. కథనాలు, వార్తల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యమి స్తుందని వివరించారు. సంపాదకీయాల్లోనూ ఆయా వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు అందిస్తున్నదని వివరించారు.