1 June, 2026 | 12:58 PM

Breaking News

Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •  

తప్పుడు వార్తలు దురదృష్టకరం

12-01-2026 03:28 AM
  1. మహిళా అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
  2. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి ): ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగి, ప్రజాసేవలో ఉన్న మహిళా అధికారుల పట్ల ఇటీవల పలు తప్పుడు వార్తలు ప్రసారం కావడం అత్యంత దురదృష్టకరమని, ఏమాత్రం నిజం లేకుండా, కేవ లం సంచలనాల కోసం, వ్యూస్ కోసం ఇ లాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయ డం ఏ మాత్రం సహించకూడదని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించిం ది. మహిళా అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రసారమైన ఇలాంటి కథనాలను సభ్యసమాజం అంతా ఖండించాలని కోరిం ది.

ఇలాంటి ప్రసారాలు ఆయా వార్తామాధ్యమాలకు తాత్కాలికంగా మేలు చేయవ చ్చు కానీ సమాజంలో వాటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, మహిళలు తమ ల క్ష్యాలను సాధించకుండా అడ్డంకిగా మారుతాయని అభిప్రాయపడ్డాయి. తప్పుడు వార్త లు ప్రసారం చేసిన సంస్థలు వెంటనే క్షమాపణ చెప్పాలని డీప్యూటీ కలెక్టర్స్ అసోసియే షన్ తెలంగాణ అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.