06-07-2025 12:00:00 AM
తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలక వర్గాల కాలపరిమితి ము గిసి దాదాపు 16 నెలలు కావస్తోంది. అయినప్పటికీ కొత్త పాలకవర్గాల ఏర్పాటు దిశ గా రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలైనా నిర్వహించండి లేదా ప్ర స్తుత పాలకవర్గాల కాల పరిమితినైనా పెం చండని తాజా మాజీ సర్పంచులు హైకోర్టుని ఆశ్రయించారు.
రాష్ట్రంలో స్థానిక ఎ న్నికలు త్వరగా నిర్వహించమని గౌరవ హై కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం 90 రోజుల సమయం కావాలని హైకోర్టుని ఆదేశించింది. రాష్ట్ర ప్రభు త్వ అభ్యర్థన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి హైకోర్టు 90 రోజుల గడు వునిచ్చింది.
సెప్టెంబర్ 30లోగా రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు తప్పకుండా నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది.
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత 2019లో మొదటిసారి స్థానిక సంస్థల ఎ న్నికలు జరిగితే మళ్లీ రెండవసారి తెలంగా ణ రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. పాలకవర్గాల పాలన లేకపోవడం, ప్రత్యేక అధికారులు పట్టిం చుకోకపోవటంతో గ్రామాల్లో పాలన పడకేసింది.
మూడు పార్టీలకి అగ్నిపరీక్షే
తెలంగాణలో బీఆర్‌ఎస్ రెండో పర్యా యం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఫలితాలు అధికార పార్టీకి అనుకూ లంగా ఏకపక్షంగానే వెలువడ్డాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి అధికార బీఆర్‌ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరిగింది.
ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కాంగ్రె స్ పార్టీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో సాధించిన విజయాలు, గణనీయంగా పెరిగిన ఓటు బ్యాంకు పరంగా చూస్తే తెలంగాణలో బీజేపీ కూడా కాం గ్రెస్, బీఆర్‌ఎస్‌లకి ప్రధాన పోటీదారుగా ఎదిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ లెక్కన చూసుకుంటే స్థానిక సమరంలో ఈ మూడు పార్టీలు ప్రధాన పోటీదారులుగా తలపడబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలం గానే ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులను మినహాయిస్తే తప్పా ఈ పోరులో అధికార పార్టీ విజయం సాధించడం తథ్యం.
2019 లెక్కలను చూసుకుంటే రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అప్పటి అధికార బీఆర్‌ఎస్ 7,774 గ్రామపంచాయతీలను గెలు చుకుంది. ఇక అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ 2709 గ్రామపంచాయతీలను కైవసం చేసుకుంది. ఆనాడు కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 163 గ్రామపంచాయతీలలో మాత్రమే విజ యం సాధించగలిగింది.
5817 మండల ప్రాదేశిక నియోజకవర్గాలలో (ఎంపీటీసీ) బీఆర్‌ఎస్ 3556, కాంగ్రెస్ 1377, బీజేపీ 211 స్థానాలలో విజయం సాధించాయి. జి ల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఫలితాలలో (జెడ్‌పీటీసీ) కూడా బీఆర్‌ఎస్ హవానే కొనసాగింది. 538 జెడ్‌పీటీసీ స్థానాల్లో బీఆర్‌ఎస్ 446, కాంగ్రెస్ 75, బీజేపీ ఎనిమిది స్థానాలలో విజయం సాధించాయి. మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లను కూడా బీఆర్‌ఎస్ కైవసం చేసు కుంది. 32 జిల్లా పరిషత్‌లకు గాను 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను బీఆర్‌ఎస్ పార్టీ ఎగరేసుకుపోయింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మూడు పార్టీలకి అగ్నిపరీక్షగా మారి.. సవాల్ విసురుతున్నాయి. అధికార కాంగ్రె స్ మెజార్టీ స్థానాలలో విజయం సాధించి తన పట్టు నిలుపుకునే వ్యూహాలను రూ పొందించుకుంటుంది. మెజార్టీ గ్రామపంచాయతీలను ఏకగ్రీవాల ద్వారా గెలుచు కొని రాజకీయంగా తన సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది.
రైతు రుణమాఫీ, రై తు భరోసా చెల్లింపులలో ఏర్పడిన గందరగోళం కాంగ్రెస్ పార్టీపై రైతులలో ఏర్ప డిన అసంతృప్తి, వృద్ధాప్య పించన్లు పెంచకపోవడం, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి 2500 ఆర్థిక స హాయం అందించకపోవడం, ఇందిరమ్మ గృహ నిర్మాణాలు వేగంగా నిర్మాణం కాకపోవటం కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్ని దెబ్బ తీసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
ప్రతిపక్షాలతో పోలిస్తే గ్రా మీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు బలమైన పునాదులు ఉండటం, అధికారంలో ఉండ టం కలిసొచ్చే అంశాలుగా కనపడుతున్నా యి. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ గతంలో సాధించిన స్థాయిలో విజయాలు సాధించకపోయినా వరుస ఓటములతో ఎదురవుతున్న పరాజయ భారం నుంచి బయటపడి రాష్ర్టంలో తన ఉనికిని చాటుకునే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
లేకపోతే ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసుకొని అధికారం సాధించాలన్నా నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులలో ధైర్యం నింపాలన్నా.. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాల్సి న అనివార్యత బీఆర్‌ఎస్‌కు ఏర్పడింది.
ఇక గ్రామీణస్థాయి బీజేపీ గురించి ఎంత తక్కు వ చెప్పుకుంటే అంత మంచిది. ఈ ప్రచారాన్ని తిప్పి కొడుతూ అసాధారణ విజ యాలు సొంతం చేసుకోవాలని కాషాయదళం తహతహలాడుతోంది. 2028లో జరగబోయే శాసనసభ ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గణనీయ స్థా యిలో ఫలితాలు సాధించాల్సి ఉంటుంది.
బీసీ రిజర్వేషన్ల మాటేమిటి?
రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు ప్రధాన ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ర్ట శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ తాము అధికారంలోకి వస్తే బీసీలకి స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వే షన్లు కల్పిస్తామనే హామీనిచ్చింది.
2019 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోయాయి. 11 శాతం రిజర్వేషన్లు తగ్గిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటిచ్చింది. ఉన్న రిజర్వేషన్లకు 19 శాతం అదనంగా కల్పిస్తామని హామీనిచ్చి అంద రూ నమ్మేలా చేయడంలో సక్సెస్ అయిం ది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుని కూడా శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
ఇక్కడి వరకు అం తా బాగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆ బిల్లు చట్ట రూపంలోకి రావడానికి ఎం త కాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది? చట్ట రూపంలోకి వచ్చే ప్రక్రి య ఏ స్థాయిలో ఉంది? చట్ట రూపంలోకి రావడానికి ఉన్న అడ్డంకులు, అవకాశాలపై కూడా స్పష్టత లేదు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం కనిపించడం లేదు.
మరోవైపు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డి మాండ్ చేస్తున్న నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల పట్ల అధికార కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది? ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ఎలా వ్యవహరించబోతున్నాయనే విషయంపై కూడా స్పష్టత లేదు.
చట్టబద్ధంగా స్థానిక సంస్థలలో బీసీలకి రిజర్వేషన్లు కల్పించలేని పక్షంలో పార్టీపరమైన రిజర్వేషన్లు కల్పించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మొత్తానికి గ్రామపంచాయతీలకి, మున్సిపాలిటీలకి, మున్సి పల్ కార్పొరేషన్‌లకి జరిగే ఎన్నికలను రాష్ట్రంలో 2028లో జరిగే శాసన సభ ఎన్నికలకి రాజకీయ పార్టీలు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నాయి. ఎవరి భవిత ఏమి టో అప్పుడే తేలాలి.
వ్యాసకర్త సెల్ 98854 65877