06-07-2025 12:00:00 AM
ఆయన చాలా సౌమ్యుడు అని, విమర్శకు ప్రతి విమర్శ చేసే రంగమైన రాజకీయాల్లో అ లాంటి సౌమ్యుడు నెగ్గుకొస్తారా? లేదా? అన్న అనుమానం కొందరిలో ఉంది. ఈ విషయంపై ఎవరో ఎందుకు.. ఆయన స్వ యంగా స్పందించారు. ‘నాకెంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరు. నేను నక్సలైట్స్‌తో కొట్లాడిన. నన్ను ఎవరైనా డమ్మీ అధ్యక్షుడు అంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది’ అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? అనే ఉత్కంఠకు పార్టీ అధిష్ఠానం తెరచింది. మా జీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత రాంచందర్‌రావుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కట్టబె ట్టింది. ఈ నిర్ణయం కొంతమందికి నిరాశ కలిగించగా మరి కొందరికి సంతోషాన్ని మిగిలించింది. ‘కాంగ్రెస్ ప్రభుత్వంతో బ లంగా కొట్లాడి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి’ అని పార్టీ బలంగా ముందుకెళ్తున్నది.
రాంచందర్‌రావు నిబద్ధత గల నేత అని పార్టీలో పేరున్నది. దశాబ్దాలుగా ఆ యన పార్టీకి సేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించే పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. పార్టీని తెలంగాణలో ప్రత్యా మ్నాయ శక్తిగా మార్చేందుకు ఆయన కృషి చేస్తారని విశ్వసించింది. అయితే.. ఆయన చాలా సౌమ్యుడు అని, విమర్శకు ప్రతి విమర్శ చేసే రంగమైన రాజకీయాల్లో అ లాంటి సౌమ్యుడు నెగ్గుకొస్తారా? లేదా? అన్న అనుమానం కొందరిలో ఉంది.
ఈ విషయంపై ఎవరో ఎందుకు.. ఆయన స్వ యంగా స్పందించారు. ‘నాకెంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరు. నేను నక్సలైట్స్‌తో కొట్లాడిన నేతను. నన్ను ఎవరైనా డమ్మీ అ ధ్యక్షుడు అని పిలిస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. విద్యార్థి దశలోనే తాను 14 సార్లు జైలుకు వెళ్లానన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలను తనను ట్రోల్ చేయాలని చూస్తున్నారని, ఆ ట్రోల్‌ను తాను ఉపేక్షించనని, తనపై కామెంట్ చేసిన వారెవరైనా జైలు పంపించి తీరుతానని హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీలో కొత్త, పాతలు లేవని, అందరూ ఒక్కటేనని ప్రకటించారు.
తాను పేరుకు మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడినని, నిజానికి తాను ప్రజా సేవకుడినని చెప్పుకొన్నారు. తెలంగాణలో పార్టీ ఎదిగిం దం టే కారణం కార్యకర్తలని ప్రకటిస్తూనే, ఆ ఘనత కార్యకర్తలదేనని కొనియాడారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కొందరు అసంతృప్తిగా ఉన్నారనేది కూడా వాస్తవం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అలసత్వంపై కొట్లాడిన బండి సంజయ్ లాంటి నాయకుడికి మళ్లీ పగ్గాలు అప్పగిస్తే బా గుంటుందనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమైంది.
అలాగే ఉద్యమకారుడిగా, బీసీ నేతగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న ఈ టల రాజేందర్‌కైనా పగ్గాలు దక్కుతాయని కొందరు కోరుకున్నారు. అలాగే కొంతవరకూ ధర్మపురి అర్వింద్ కూడా పార్టీ పద వి అప్పగిస్తుందనే ఊహాగానాలు సాగా యి. చివరకు పార్టీ మాత్రం రాంచందర్‌వై పే మొగ్గు చూపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది.
ప్రశ్నార్థకంగా క్రమశిక్షణ..
క్రమశిక్షణకు సిద్ధాంతానికి కట్టుబడి ఉండే భారతీయ జనతా పార్టీలో ఈ మ ధ్య కాలంలో పరోక్షంగా కొందరి నుంచి అసమ్మతి రాగం వినిపిస్తుందనేది వాస్త వం. అందుకు నిదర్శనం.. నూతన అధ్యక్షుడిగా రాంచందర్‌రావు నియామాకం త ర్వాత, పార్టీ చేపట్టిన ప్రమాణ స్వీకారోత్సవానికి కొంతమంది నాయకులు గైర్హాజరు కావడం.
వారు వ్యవహరించిన తీరుతో పా ర్టీలో అంతర్గ విభేదాలు ఉన్నాయనే సందేహాలను లేవనెత్తింది. గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్ వంటి నేతలైతే బహిరంగంగానే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడి పదవికి నామినేషన్ వేసేందుకు వెళితే, కొందరు తనను బెదిరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన కామెంట్లు అప్పుడు సంచలనం సృష్టించాయి.
కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్నట్లుగానే భారతీయ జనతా పార్టీ తెలంగా ణలోనూ ఉన్నప్పటికీ.. అంతర్గత అసంతృప్తులు, విభేదాలు పార్టీ కొంత నష్టం చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ నియమావళిని మీరి కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుండటం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇలాంటి అసంతృప్తులు, విభేదాలను అన్నింటినీ నూతన అధ్యక్షుడు రాంచందర్‌రావు పరిష్కరించాల్సి ఉన్నది.
ఇక బీజేపీ వంతు వచ్చేనా ?
దేశంలో జరిగిన ఏ ఎన్నికలో అయినా బీజేపీ హవా కొనసాగినట్లుగానే తెలంగాణలోనూ పార్టీ సత్తా చాటుతుందని అనేక సభల్లో చెప్పే పార్టీ నేతలు.. క్షేత్రస్థాయిలో మాత్రం అంత దూసుకుపోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ, మండల స్థాయిలో మరింత చొచ్చుకుపోతే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీలో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నా యి.
తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్‌ను కాదని, అందుకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. కేసులు, విచారణల కారణంగా బీఆర్‌ఎస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాక్షాత్తు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్, మరో పెద్ద నేత హరీశ్‌రావు కాళేశ్వరం కుంగుబాటు కేసులో నిందితులు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫా ర్ములా ఈ కేసులో నిందితుడిగా విచారణకు హాజరవుతున్నారు. అడపా దడపా ఆయన విదేశాల పర్యటనకు వెళ్తూనే ఉన్నారు.
ఆయా కేసుల రీత్యా వారు ప్రజలకు మధ్యకు వెళ్లడం లేదనేది సుష్ప ష్టం. ఇలాంటి తరుణాన్ని బీజేపీ నేతలు సద్వినియోగం చేసుకోవాల్సి ఉండగా, వా రు ఆ పనిచేయడం లేదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు హడావిడి చేసి, ఆ తర్వాత మిన్నకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరించిన రాంచందర్‌రావు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉన్నది.
మరెన్నో అంతర్గత విభే దాలను పరిష్కరించాల్సి ఉన్నది. పార్టీ పెద్దల సలహాలు, సూచనలతో పాటు పార్టీ నియమావళిని అమలు చేస్తూ, ముందుకు సాగాల్సి ఉంది. పార్టీ అధిష్ఠానం కూడా ఆ యనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నది.
విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నేతగా రాం చందర్‌రావు కూడా ఆ మేరకు చొరవ చూ పుతారనే చర్చ కూడా ఆయనకు అనుకూలంగా జరుగుతున్నది. ప్రతిపక్షాలను తూలనాడడం, వారిపై బూతులతో విరుచుకుపడడం ఇప్పటి రాజకీయాల్లో ఒక ట్రెండ్‌గా కొనసాగుతున్నది. మరి కొత్త చీఫ్ వాటిని ఎలా తట్టుకుంటారు? పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్తారనేది మున్ముం దు చూడాల్సిందే.
వ్యాసకర్త సెల్ 90527 89666