12-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే11( విజయ క్రాంతి):సాహితి వేత్త సామల సదాశివ భాస్కర్ జయంతి వేడుకలను ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాగ జ్ నగర్ పట్టణం లోని మాస్టర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు.
ఈ సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలు, సమాజ హితం కోసం రచించిన నవలలు, పుస్తకాలు సమాజ మార్పు కోసం ఎంతో ఉపయోగపడ్డాయని పలువురు వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామల రాజన్న, కటకం మధు కర్, మామిడాల తిరుపతయ్య, కేదారే ,సత్యనారాయణ, సాంబయ్య, చక్రపాణి, కోటేశ్వరరావు, వాసు, అశోక్, సత్యనారాయణ, బాపు, తోగులయ్య, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, సురేందర్, హరి, హిమేష్ పాల్గొన్నారు.