18 April, 2026 | 7:28 PM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూజలు

12-05-2025 12:00 AM

నిర్మల్, మే 12( విజయ క్రాంతి) : నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ భారత సైనికులకు ఆత్మ స్థైర్యం నింపాలని ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మండల, గ్రామ కేంద్రాల్లో గల ఆలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు చిట్యాల్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వా మి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నా యకులు రాంనాథ్, జమాల్, మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, అనిల్, సత్యం చంద్రకాం త్, శ్రీకాంత్ రెడ్డి, రమేష్, సాదం అరవింద్, జుట్టు దినేష్, అయిండ్ల సాత్విక్, సాయేందర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.