calender_icon.png 25 May, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గం

12-05-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్‌రెడ్డి 

పటాన్ చెరు, మే 11 : అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామ పరిధిలో నిరుపేదల నిర్మించుకున్న ఇండ్లను అధికారులు కూల్చివేయడాన్ని బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువ ఆదివారం కూల్చివేసిన నిరుపేదల ఇండ్లను జిన్నారం మాజీ జెడ్పిటిసి కొలను బాల్ రెడ్డి తో కలిసి ఆదర్శ్ రెడ్డి పరిశీలించారు. 

గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 381 లో ఐదు సంవత్సరాల క్రితం పట్టా సర్టిఫికెట్లు పొంది 23మంది ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపారు. కాగా తహసిల్దార్ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల ఇల్లు కూల్చడం దారుణం అని అన్నా రు.  ఈ ప్రభుత్వం ఒక నిరుపేదకు ఇల్లు ని ర్మించలేదు కానీ కట్టిన ఇండ్లను కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్ తదితరులు ఉన్నారు.