calender_icon.png 20 July, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవాను త్యాగానికి దృశ్యరూపం..

20-07-2025 12:12:51 AM

దేశం కోసం మనలో ఒక్కడు 

‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన యువ జవాన్ మురళీ నాయక్ సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’. యువ దర్శకుడు గోపివర్మ తెరకెక్కించిన ఈ ఇండిపెండెంట్ మూవీని ప్రసాద్ నిర్మించారు. కోటేశ్వరరావు, రాజశేఖర్, కృష్ణవేణి, నాగరాజు,  శ్వేత, సింధు, నాగబాబు, జ్యోతి, రాజు తదితరులు నటించారు.

ఈ చిత్రాన్ని మేకర్స్ శనివారం లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ చిత్రబృందాన్ని అభినందించారు. పెట్టిన పెట్టుబడిలో వెనక్కి రాదని తెలిసి కూడా, మురళీనాయక్ సాహసాన్ని కీర్తి స్తూ ఈ సినిమా నిర్మించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘దేశం కోసం మనలో ఒక్కడు’ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నామని ఈ వేదికపైనుంచి మూవీ టీమ్ ప్రకటించింది.

నిర్మాత మాట్లాడుతూ.. “ఇంత గొప్ప చిత్రం నిర్మించే అవకాశం రావడం గర్వంగా ఉంది. నా దర్శకత్వంలో మొదలైన ‘రాయలసీమ ప్రేమకథ’ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది” అని తెలిపారు.