20-07-2025 12:10:42 AM
మల్టీ టాలెంటెడ్ స్టార్ ఎస్‌జే సూర్య పదేళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. గోకులం గోపాలన్ నేతృత్వంలోని శ్రీ గోకులం మూవీస్, ఎస్‌జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. మేకర్స్ విడుదల చేసిన రెండు పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఓ పోస్టర్‌లో ఎస్‌జే సూర్య నల్ల కోటు ధరించి షాట్ గన్ పట్టుకుని స్టులిష్‌గా కనిపించారు.
మరో పోస్టర్‌లో ఎస్‌జే సూర్య చేతిలో గన్ పట్టుకుని తన భుజాన రెడ్‌డ్రెస్‌లో ఉన్న ప్రీతి అస్రానిని ఎత్తుకున్న లుక్ ఆకర్షణీయంగా ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీత సార థ్యం వహిస్తున్న ఈ సినిమాను మేకర్స్ ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.