20-07-2025 12:14:35 AM
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి నాయకానాయికలుగా నటించిన సినిమా ‘రాజు గాని సవాల్’. ఎల్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా దర్శక నిర్మాణ బాధ్యతలు చిత్ర కథానాయకుడు లెలిజాల రవీందర్ నిర్వర్తించారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్లు డింపుల్ హయతి, రాశీసింగ్, గీత రచయిత గోరటి వెంకన్నతోపాటు సినీరంగానికి చెందిన మరికొందరు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డింపుల్ హయతి మాట్లాడుతూ.. “రాజు గాని సవాల్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ కోసం నేనూ ఎదురుచూస్తున్నా” అన్నారు. రాశీసింగ్ మాట్లాడుతూ.. “ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. బాపిరాజు నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టాలి.
సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు. చిత్ర కథా నాయిక రితికా చక్రవర్తి మాట్లాడుతూ.. “ఈ సినిమాను ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. భారీ అంచనాలు పెట్టుకోలేదు కానీ, తప్పకుండా ఈ సినిమా మేమందరం హ్యాపీగా ఫీలయ్యే రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నాం” అన్నారు. దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. “మా జీవితాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది.
సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చే శాం. మధ్యతరగతి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఒక పెద్ద సమ స్య ఎదురైతే ఆ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ చిత్రంలో చూపిస్తు న్నాం. బాపిరాజు ‘రాజు గాని సవాల్’ క్లాసిక్ డ్రామాగా మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పారు.
ఆయన మాట నిజం కావాలని ఆశిస్తున్నా” అన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. “మాపై అభిమానంతో ఇంత మంది మా వెనక నిలబ డ్డారు. వారి బ్లెస్సింగ్స్‌తో మా ‘రాజు గాని సవాల్’ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గీత రచయిత గోరటి వెంకన్న, నటీ నటులు డాక్టర్ భద్రం, సంధ్య రాథోడ్, రవీందర్ బొమ్మకంటి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.