21 June, 2026 | 1:53 PM

రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం...

19-06-2026 12:29 PM

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. 

తాండూరు, జూన్ 19,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా కృషి చేద్దామని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి లతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల, మైనార్టీల, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేస్తుందని రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందిస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు  బాతుల నాగరాజు, కరణం పురుషోత్తం రావు, రుద్రారం మహిపాల్ రెడ్డి, జిలాని, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.